నంద్యాల అర్బన్: నంద్యాల మండలంలో బాల్య వివాహాన్ని అడ్డుకున్న శక్తి టీం
Nandyal Urban, Nandyal | May 13, 2026
నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారంతో శక్తి టీమ్ సభ్యులు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. హెచ్పీసీ ప్రసాద్, ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్లు, వీఆర్వోలు అక్కడికి వెళ్లి ఇద్దరు మైనర్లకు పెళ్లి చేయడం నేరమని స్పష్టం చేశారు. బాల్య వివాహాల అనర్థాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయికి వయసు నిండేంత వరకు పెళ్లి చేయబోమని వారి నుంచి రాతపూర్వక హామీ తీసుకున్నారు.