కోడుమూరు: గూడూరు బాలికల ఉన్నత పాఠశాలలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం
గూడూరు బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఐసిడిఎస్ అధికారులు భేటీ బచావో బేటి పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపిల్లలు చదువుకోవాలని బాల్య వివాహాలు నేరమన్నారు. చిన్న వయసులో పెళ్లి జరిపిస్తే భారీగా జరిమానా, జైలు శిక్ష పడుతుందన్నారు. ఆడపిల్లలు సమతుల ఆహారం తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు పద్మావతి, జరీనా పాల్గొన్నారు.