కర్నూలు: తమ గ్రామం నుండి రైతు భరోసా కేంద్రాన్ని తరలించవద్దు: కర్నూలు కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన
తమ గ్రామం నుండి రైతు భరోసా కేంద్రాన్ని తరలించోదంటూ మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టరేట్ ఎదుట రైతు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేముగొడు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని తరలిస్తే తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతామని రైతు వాపోతున్నారు. ఇప్పటికే విలేజ్ అగ్రికల్చర్ సెక్రటేటరీని తరలించి, తమకు రైతు భరోసా కేంద్ర లేకుండా చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. గతంలో తమకు రైతు భరోసా కేంద్రం ద్వారా అన్ని సేవలు అందాయని ఇప్పుడు పక్క గ్రామానికి వెళ్ళాలంటే చాలా కష్టంగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.