డోన్: మాజీ మంత్రి బుగ్గన ను విమర్శించే అర్హత టిడిపికి లేదు: డోన్ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి
Dhone, Nandyal | Jul 10, 2026 ఐదేళ్ల వైసీపీ పాలనలో డోన్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మాజీ మంత్రి బుగ్గనను విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదని ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఐదేళ్లు బుగ్గన విజయవాడలోనే ఉన్నారని మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్రానికి మంత్రి కావడంతోనే విజయవాడలో ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి చేయకుండా మాజీ మంత్రిపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.