ఆళ్లగడ్డ: చాగలమర్రి కి చెందిన యువకుడు కాజా షేక్షావలికి రెండు స్వర్ణ పతకాలు
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన 63వ వార్షిక స్నాతకోత్సవం లో ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి కి చెందిన ఖాజీ షేక్షావలి విశిష్ట ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతాకాలు అందుకొని అరుదైన ఘనతను సాధించారు, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎం ఎల్ ఐ ఎస్ సి కోర్సులో ప్రధమ ర్యాంకు సాధించారు, దీంతో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నర్రావుల గురు స్వామి నాయుడు ఆయనను గోల్డ్ మెడల్ తో సత్కరించారు