ఒంగోలు అర్బన్: ' జలధార - జలహారతి ' కార్యక్రమం క్రింద చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 24, 2026
' జలధార - జలహారతి ' కార్యక్రమం క్రింద చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం సిసిఎల్ఏ జయలక్ష్మి అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం, రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పురోగతి, జలధార - జల హారతి, తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం ఆయా అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా చర్చించారు.