రంగంపేటలో పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నలుగురు అరెస్ట్ 7070 రూపాయలు స్వాధీనం
వరంగల్ నగరంలోని రంగంపేట ప్రాంతంలో మహాలక్ష్మి టెంపుల్ రోడ్ లో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు పేకాట స్థావరం పై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఈ ప్లేయింగ్ కార్డ్స్ మరియు 7070 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అనంతరం నిందితులను మరియు పట్టుబడిన ప్రాపర్టీని మట్టేవాడ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మట్టేవాడ పోలీసులు.