పుంగనూరు: మధురమలై కొండ ప్రాంతంలో కల్వర్టర్ కు గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ. మధురమలై కొండ ప్రాంతంలో తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టర్ కు గండి పడిన ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పరిశీలించారు. వీరపల్లి, గువ్వలగుట్ట ఎస్టి కాలనీలో పర్యటించారు. కాలనీలో శిథిలవస్థలో ఉన్న ఇండ్లను తిరిగి నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సుధాకర్, ఎమ్మార్వో మధుసూదన్, ఎంపీడీవో జీ.వీ.ఎస్.వి. ప్రసాద్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.