బేతంచెర్ల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం అండ: ఆర్డిఓ నరసింహులు
Dhone, Nandyal | May 4, 2025 బేతంచెర్ల పట్టణంలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు మొహిద్దీన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని డోన్ ఆర్డీవో నరసింహులు అన్నారు. బాలుడి తల్లిదండ్రులకు ఆదివారం రూ.3 లక్షల చెక్కును ఆర్డీవో, మండల ప్రత్యేక అధికారి నసీరున్నీషా బేగం, మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలుడి మృతి పై స్పందించిన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లి కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును అందించేందుకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాష్బాబు, వీఆర్వ