నాలుగు రోజులుగా అదృశ్యమైన గోపవరం గ్రామానికి చెందిన భరత్ అనే యువకుడు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన తిరుమలపాటి భరత్ అనే యువకుడు గత నాలుగు రోజులుగా కనిపించడం లేదని వారి తల్లిదండ్రులు మహానంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు,శుక్రవారం సాయంత్రం నుంచి ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిన భరత్, ఆదివారం మధ్యాహ్న సమయం కూడా అతని ఆచూకీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులకు మహానంది పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలియజేశారు,