గుంతకల్లు: పట్టణంలో సీపీఐ పార్టీ రిలే దీక్షలు, సంఘీభావం తెలిపిన సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట గత నాలుగు రోజులుగా సీపీఐ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. శుక్రవారం సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గుంతకల్లు డివిజన్ కమిటీ కార్యదర్శి బి.సురేష్ మాట్లాడుతూ గుంతకల్లు మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, పేదలు నివసిస్తున్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో పాలకవర్గం పూర్తి వైఫల్యం చెందిందని అన్నారు.