నంద్యాల అర్బన్: హోంగార్డులు నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి నంద్యాల జిల్లా హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్
Nandyal Urban, Nandyal | Jun 18, 2026
హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని హోంగార్డ్స్ కమాండెంట్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద గురువారం పరేడ్ నిర్వహించారు. మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలన్నారు. హోంగార్డుల సంక్షేమానికి పోలీసు శాఖ కట్టుబడి ఉంటుందన్నారు. ప్రతీ ఏడాది హోంగార్డులు, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షల నిర్వహిస్తున్నట్లు తెలిపారు