అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఎర్రగుడి గ్రామంలో మంగళవారం గ్రామ దేవత మారెమ్మ జాతర మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి మారెమ్మ దేవత ఉత్సవ విగ్రహలతో గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం అమ్మవారు కొలువు తీరారు. జాతర పూజల్లో భాగంగా నీరా ఘట్టాల పూజలు, బోనాలను అమ్మవారికి సమర్పించిన అనంతరం రాత్రి 10 గంటల నుండి బలి పూజా కార్యక్రమాలను చేపట్టారు. గ్రామ జాతర సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.