ప్రకాశం జిల్లాలో పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు శుక్రవారం ఒంగోలులోని కొత్త మామడిపాలెంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా డీటీసీలో మొక్కను ఎస్పీ నాటారు. ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన 193 మంది ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లు ఈనెల 22 నుంచి డీటీసీలో శిక్షణ పొందనున్నారు. వారికి కల్పించే వసతులపై ఎస్పీ ఆరా తీశారు.