నారాయణపేట్: జిల్లాలో క్రాప్ బుకింగ్ ను 100% పూర్తి చేయాలి: కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట జిల్లాలో క్రాప్ బుకింగ్ ను 100% పూర్తి చేసి పత్తి కొనుగోళ్లకు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ గురించి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం క్రాస్ రోడ్ వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో సోమవారం 4:30 గంటల సమయంలో ఏర్పాటు చేసిన వ్యవసాయం మార్కెటింగ్ హార్టికల్చర్ శాఖ అధికారుల సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ పత్తి కొనుగోలు పారదర్శకంగా జరిగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.