ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలోని రామలక్ష్మి కొట్టాలలో భక్తిశ్రద్ధలతో సత్యమ్మ అమ్మవారికి బోనాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని రామలక్ష్మి కొట్టాలలో వేలసిన సత్యమ్మ అమ్మవారి బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో మహిళలు ఆలయాన్ని చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ప్రతి ఏటా ఆషాడ మాసంలో జెరుగు సత్తెమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు నైవేద్యం సమర్పిస్తూ సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రార్థించారు, అనంతరం ఆలయ అర్చకుడు పుల్లయ్య చారి తీర్థ ప్రసాదాలు అందజేశారు