ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడ గంగమ్మ జాతరలో: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సందడి
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల కేంద్రంలో బుధవారం గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఈ వేడుకల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు, అనంతరం జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన సీనియర్ వృషభరాజముల బండలాగుడు పందెం పోటీలను ఎమ్మెల్యే అఖిల ప్రియ ప్రారంభించారు ఈ జాతరకు భక్తులు ప్రజలు భారీగా తరలివచ్చి సందడి చేశారు,హోర హోరిగా సాగిన బండలాగుడు పందెం పోటీలో గెలపొందిన వృషభ యజమానులకు ఆలయ కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు