ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్రమత్తమైన పోలీసులు నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు
Ongole Urban, Prakasam | May 15, 2026
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ప్రత్యేకంగా వాహన తనిఖీలను కూడా నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తూ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రాత్రి సమయంలో అనవసరంగా మరియు అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేసి, వాటి రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర రికార్డులను పరిశీలించారు. సరైన పత్రాలు లేని లేదా రోడ్డు/ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు చేపట్టారు.