వేములవాడ: మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.వేములవాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం పలువురు మహిళలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలసి శాలువతో సన్మానించారు.సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారని తెలిపారు.అందులో భాగంగా రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని అన్నారు.