ఆత్మకూరు: పోగిట్టుకున్న ఫోన్ బాధితునికి అందజేత
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మోట్లంపల్లి గ్రామానికి చెందిన గుడిసి నాగన్న గత నెల 27న గుంటీపల్లి నుంచి ఆత్మకూరుకు బైక్ పై వెళుతుండగా తన మొబైల్ ఫోన్ పడిపోయింది. వెంటనే ఆత్మకూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ నరేందర్ ఆధ్వర్యంలో సిఇఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ను రికవరీ చేసి బాధితుడికి మంగళవారం సాయంత్రం 6 గంటలకు అప్పగించారు