జహీరాబాద్: పోలీసు విధులను ఆటంకపరిచి ముగ్గురు యువకుల పై కేసు నమోదు
సంగారెడ్డి జిల్లా హద్నూర్ పోలీసుల విధులను అటంకపరచిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుజిత్ తెలిపారు. న్యాల్కల్ మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి పోలీసులు పెట్రోలింగ్ కు వెళ్లగా రోడ్డుపై మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులను ఇక్కడ ఏం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా వారిపై దురుసుగా మాట్లాడుతూ సెల్ఫోన్ లాక్కుని విధులను అటంక పరచినట్లు తెలిపారు. గురువారం ఉదయం ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.