నందికోట్కూరు: ఇంటర్ ఫలితాల్లో మిడుతూరు మండల టాపర్ గా స్వప్న:కేజీబీవీలో 100 శాతం ఉత్తీర్ణత
బుధవారం వెలువడిన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో నంద్యాల జిల్లా మిడుతూరు మండలం కేంద్రంలో ఉన్న మోడల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వప్న బైపిసి (979) మార్కులతో మండల టాపర్ గా నిలిచారు.ఇదే కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం 93 మంది విద్యార్థులకు గాను 88 మంది విద్యార్థులు పాస్ అయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు.అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో 28 మంది విద్యార్థులకు గాను అందరూ ఉత్తీర్ణత కనబరిచారు.వీరిలో ఎస్ మల్లేశ్వరి ఎంపీసీ (965),మంజుల,గంగోత్రి (926) బాలికల మంచి ఉత్తీర్ణత కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు,అదేవిధంగా