ఆలేరు: కందిగడ్డ తండా వద్ద దేవాదుల నుండి ఆలేరుకు నీరు వచ్చే ఎడమ కాలువ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
Alair, Yadadri | Sep 15, 2025 యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండల పరిధిలోని కందగడ్డ తండా వద్ద దేవాదుల నుండి ఆలేరుకు నీరు వచ్చే ఎడమ కాలువ పనులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం సాయంత్రం ప్రారంభించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇద్దరు అన్నదమ్ముల భూ తగాదాల వల్ల కందిగడ్డ తండా వద్ద నిలిచిపోయాయని తెలిపారు. గత పాలకులు పదేళ్ల పాలనలో ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శించారు.