నారాయణపేట పట్టణ నర్సరీ మరియు తడి చెత్త నుండి తయారయ్యే ఎరువును పేట మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య బుధవారం మూడు గంటల సమయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీ లోని మొక్కలు అన్నిటికీ విధిగా నీళ్లు పోస్తూ సంరక్షించాలని ఎప్పటికప్పుడు పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి చెత్త నుండి ఎరువును తయారు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.