ఖైరతాబాద్: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నాయకులు 13 ఏళ్ల అమ్మాయితో కూడా దొంగ ఓటు వేయించారు: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్
కాంగ్రెస్ నాయకులు 13 ఏళ్ల అమ్మాయితో కూడా దొంగ ఓటు వేయించారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. దొంగ ఓట్లు వేసే వాళ్లకు కనీసం వాళ్ల దగ్గర ఉన్న ఓటర్ ఐడీ కార్డులో పేరు కూడా తెలియదని, ఇదంతా పోలీస్, ఎన్నికల సంఘం అధికారుల ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు