డోన్: డోన్ లో ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
Dhone, Nandyal | Apr 19, 2026 అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా డోన్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని ఫైర్ సిబ్బంది నిర్వహించారు.ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రోగులను ఎలా రక్షించాలి, మెట్లు లేదా ర్యాంప్ల ద్వారా వారిని ఎలా తరలించాలో వివరంగా ఆసుపత్రి సిబ్బందికి వివరించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్ ఉపయోగించవద్దని ఆసుపత్రి సిబ్బందికి, రోగులకు సూచించారు.