రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ 32 నెలలుగా కనిపించలేదు అనంతపురంలో ఆర్ పి ఎస్ వ్యవస్థాపకుడు నాగరాజ
అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం 4:30 గంటల సమయంలో రాప్తాడు ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు నాగరాజు మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత 32 నెలలుగా ఎక్కడ గాని నిరుద్యోగుల సమస్యలు గాని ఉపాధ్యాయుల సమస్యల గురించి గానీ ఈ ఎమ్మెల్సీలు మాట్లాడడం లేదని 32 నెలలుగా వీరు కనిపించకుండా పోయారని వీరు ఆచూకీ తెలిపిన వారికి పదివేల రూపాయలు బహుమతి ఇస్తానని రాప్తాడు ఆర్ పి ఎస్ వ్యవస్థాపకుడు నాగరాజు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలలపై పలు విమర్శలు చేశారు.