గుంటూరు: వెలగపూడి సచివాలయం ప్రాంతంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
Guntur, Guntur | Sep 14, 2025 ఈ నెల 15 వ తేదీ అనగా రేపు సోమవారం నుండి రెండు రోజులపాటు వెలగపూడి సచివాలయంలో జరగనున్న కలెక్టర్ల సదస్సుకు సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లను చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆదివారం రాత్రి ఒక ప్రకటన ద్వారా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రెండు రోజులు పాటు జరిగే కలెక్టర్ల సదస్సుకు సంబంధించి ఐదవ బ్లాక్ నందు ఏర్పాట్లను, వీవీఐపీలు మరియు వీఐపీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ భారీ కేటింగ్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.