ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 8, 2026
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను కలెక్టర్ రాజాబాబు స్వీకరించారు. వచ్చిన అర్జీలలో కొన్నిటిని వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్నిటిని పరిశీలించి అధికారులతో మాట్లాడి కచ్చితంగా పరిష్కరిస్తామని అర్జీదారులతో కలెక్టర్ అన్నారు.