అవుకు: అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో కార్తిక వనభోజన కార్యక్రమం.
బనగానపల్లె నియోజకవర్గం అవుకు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో కార్తీక వన భోజన కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి నామ స్మరణతో పూజ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం గురు స్వాములను సన్మానించారు.