కర్నూలు: పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు కర్నూలు నగరంలో గల స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో రాష్ట్ర మంత్రి టీ.జి భరత్ తో కలిసి ఆయన పాల్గొన్నారు...ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళ్లు అర్పించారు... అనంతరం మంత్రితో కలిసి అమరవీరుల కుటుంబాల వారిని శాలువాలతో సన్మానించి సత్కరించారు...ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయమన్నారు..