ఈనెల 17నుంచి అక్టోబర్ 2వరకూ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు: రాజేంద్రపాలెం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ హేమంత్ చౌదరి
కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం పీహెచ్సీ పరిధిలోని పలు గ్రామాల్లో ఈనెల 17నుంచి అక్టోబర్ 2వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ హేమంత్ చౌదరి, సీహెచ్వో ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈమేరకు మంగళవారం సాయంత్రం పీహెచ్సీ ఎదుట కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా, మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు.