నరసరావుపేట పట్టణంలో ఆటోలో ప్రయాణించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో కలెక్టర్ కృతిక శుక్లా శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించేందుకు స్థానిక భువనచంద్ర టౌన్ హాలుకు ఆటోలో వెళ్లారు ఆటో డ్రైవర్ల సేవా పథకానికి సంబంధించిన మెగా చెక్కును వివిధ శాఖ అధికారులతో కలిసి అందజేశారు ఆమె అనంతరం మాట్లాడుతూ నేను సామాన్య కుటుంబం నుంచే కలెక్టర్ అయ్యానని అన్నారు కాలేజీ చదివే రోజుల్లో ఆటోలనే ప్రయాణించినట్లు గుర్తు చేసుకున్నారు.