రాత్రి నుంచి కురుస్తున్న వర్షం.. రహదారులపై నీటి నిల్వలు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో మంగళవారం రాత్రి నుంచి వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. బుధవారం కూడా ఆకాశం మేఘావృతమై, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ కారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు బయటకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ప్రయాణాల్లో ఇరుక్కుపోతున్నారు.వర్షాల ప్రభావంతో పంట పొలాల్లో నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. గాలివీడు పట్టణంలో ప్రధాన రహదారులు, బజార్లలో నీరు నిలిచిపోవడంతో వ్యాపారుల