వరంగల్: లేబర్ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి, ఐదుగురు అరెస్ట్
వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 29,600 నగదు, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ స్వామి తెలిపారు.