ఆళ్లగడ్డ: అహోబిలం టోల్ గేట్ వేలంపాటలో హై టెన్షన్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం దేవస్థానం టోల్ గేట్ వేలంపాట తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసింది, శనివారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి అనుచరులు వేలం లో పాల్గొనకుండా పోలీసులు వారి వాహనాలను దారిలోనే నిలిపివేశారు, దీనిపై ఏవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను నిలదీశారు, చివరకు అనుచరులతో కలిసి ఆయన అహోబిలం టోల్ గేట్ వద్దకు చేరుకోవడంతో అక్కడ తీవ్ర హై టెన్షన్ వాతావరణం నెలకొంది