గిరిజన సహకార సంస్థ అరకు వ్యాలీ కాఫీకి ‘ఛేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు: జిసిసి ఎండి కల్పనా కుమారి
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అరకు వ్యాలీ కాఫీకి 'ఛేంజ్ మేకర్ ఆఫ్ ది' ఇయర్ అవార్డు లభించినట్లు జిసిసి ఎండి కల్పనకుమారి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు ముంబైలో ఈ అవార్డును సంస్థ ఎండీ కల్పనా కుమారి స్వీకరించారు. బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్ అవార్డ్స్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాటగిరిలో అవార్డు వచ్చింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరదీప్ సింగ్ అవార్డు అందజేశారు. గిరిజన రైతులు, సిబ్బంది అంకితభావం వల్ల అవార్డు వచ్చిందని ఎండీ కల్పనాకుమారి పేర్కొన్నారు.