ఎమ్మిగనూరు: గోనెగండ్లలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు..
ఎమ్మిగనూరు మండల పరిధిలోని గోనెగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ జ్యోతి ఆధ్వర్యంలో బుధవారం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఆస్ఐఓ లాలప్ప, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, ప్రిన్సిపల్ జ్యోతి కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.