నంద్యాల అర్బన్: పార్టీలో కోవర్ట్లను వదిలిపెట్టం: నంద్యాలలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు
Nandyal Urban, Nandyal | Jun 9, 2026
నంద్యాల పట్టణం కలెక్టరేట్ లో సోమవారం జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉన్నప్పుడు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఏకగ్రీవాలు కావాలని చెప్పారని ఇప్పుడు మాత్రం అందరూ పోటీ చేసి కేసులు పట్టించుకోవాలని చెబుతున్నట్లు ఉంది అన్నారు. అలాగే నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీలోని కోవర్ట్లను నారా లోకేష్ వదిలిపెట్టరని వచ్చే రెండు సంవత్సరాల్లో వారి సంగతి కచ్చితంగా తెలుస్తారని ఆమె