డోన్: మోడీ నాయకత్వాన్ని ఆదరించాలి :బేతంచెర్ల బిజెపి నేతలు
Dhone, Nandyal | May 5, 2026 సుస్థిర పాలన కోసం ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆదరించాలని బీజేపీ నేతలు నాగమోహన్, సుబ్బారెడ్డి, ఉపేంద్ర పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ తోపాటు ఇతర ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించడంపై మంగళవారం బేతంచెర్లలో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.