సంగారెడ్డి: విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి : టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని ఉపాధ్యాయ భవన్ లో విద్యా సదస్సు ను ఆదివారం నిర్వహించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి రామచందర్ నాయకులు పాల్గొన్నారు.