మాజీ జడ్పీటీసీపై సస్పెన్షన్ ఎత్తివేయాలి' యాచారం మండల బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య పై పార్టీ అధిష్ఠానం విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని మాజీ జడ్పీటీసీ కందుకూరి రామచంద్రయ్య డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు సస్పెన్షన్ ప్రకటనను వెనక్కి తీసుకుని, ఆమెను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన కోరారు. ప్రెస్మీట్ ద్వారా సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.