పాన్‌గల్: మదనపూర్ మండలం రామన్ పాడు రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రామన్ పాడు రిజర్వాయర్ లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మదనపురం మండలం రామన్ పాడు గ్రామానికి చెందిన వాకిటి గిరి ఆదివారం ఉదయం చేపల వేటకు రామన్ పాడు రిజర్వాయర్ లోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాళ్లకు చేపల వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు.వాకిటి గిరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.