తాడిపత్రి: పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప్ ప్రతిజ్ఞ కార్యక్రమం
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో బీజేపీ నాయకులు ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప్ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని 208 పోలింగ్ బూత్ అంబేద్కర్ నగర్ లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మైదుకూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో మంగళవారం ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. మన స్వదేశీ వస్తువుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కాలనీలోని అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు సూచనలు చేశారు.