జహీరాబాద్: నియోజకవర్గంలోని 21 మంది లబ్ధిదారులకు 9 లక్షల 70 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు ఎంతో అండగా నిలుస్తుందని ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మాజీ మంత్రి చంద్రశేఖర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు తొమ్మిది లక్షల 70 వేల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు హనుమంతరావు, మక్సుద్, రాములు తదితరు నాయకులు ఉన్నారు.