ఒంగోలు అర్బన్: ప్రతిపు కలిగిన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించి అభినందించిన మంత్రి మరియు కలెక్టర్
Ongole Urban, Prakasam | May 15, 2026
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో అద్దంకి నియోజక వర్గ పరిధిలోని అద్దంకి అర్బన్ తో పాటు 5 మండలాల్లో ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ప్రతి మండలంలోని మొదటి 5 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను 10 వేల రూపాయల నగదుతో శాలువ కప్పి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉందన్నారు