దాచేపల్లిలో తాగునీటి కోసం హైవేపై మహిళల ధర్నా
దాచేపల్లి - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇరికేపల్లి బోటు వద్ద మంచినీటి సమస్యపై బుధవారం మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇరికేపల్లిలోని దుర్గ భవాని కాలనీ వాసులు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మహిళల ధర్నా కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.