కోడుమూరు: వర్కూరులో వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు ఎంపీడీవో అవగాహన
కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామంలో వాట్సాప్ గవర్నెన్స్ పై ఎంపీడీవో రాముడు శుక్రవారం ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా పలు సేవలను అందిస్తోందని, వినియోగించుకోవాలని కోరారు. తద్వారా సమయం ఆదా అవుతుందన్నారు. సేవలు పొందే విధానంపై సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.