నంద్యాల అర్బన్: రామున్ని దూషించిన వ్యక్తికి వైసిపి సాయం : నంద్యాల సభలో సీఎం చంద్రబాబు
Nandyal Urban, Nandyal | Jul 9, 2026
నంద్యాల జిల్లా బనగానపల్లెలో 'మీ భూమి-మీ హక్కు' సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 'రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించి.. రాముడు, సీతమ్మలపై నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని, పాకిస్థాన్ను సమర్ధించాడు. ఆ వ్యక్తికి గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది. ఎంత బరితెగింపు' అని ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని దీనిపై రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని సీఎం కోరారు.'ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమ. నేనూ రాయలసీమ బిడ్డనే. ఈరోజు చెప్తున్నా.. రాయలసీమ రాళ్లసీమ కాదు. రతనాల సీమ. రైజింగ్ సీమ' అని CM చంద్రబాబు అన్నారు.