తణుకు: ఫైర్ ఆఫీసర్ అజయ్ కుమార్, హోంగార్డు స్కూటీపై వెళ్తుండగా వెనక నుండి ఢీకొన్న కారు, ఫైర్ ఆఫీసర్, హోంగార్డుకు గాయాలు
తణుకులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫైర్ ఆఫీసర్, హోంగార్డుకు గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. తణుకు ఫైర్ ఆఫీసర్ అజయ్ కుమార్, హోంగార్డు స్కూటీపై వెళ్తుండగా స్థానిక థియేటర్ సమీపంలో వెనక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైర్ ఆఫీసర్, హోంగార్డుకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను తణుకులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.